తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం: సీఎం రేవంత్
- November 14, 2024
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గురువారం విజయోత్సవాలఫై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని , ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని అధికారులకు , నేతలకు తెలిపారు. అలాగే విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభల్లో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు.
నవంబర్ 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు జరపాలని పేర్కొన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల వారీగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఇక డిసెంబర్ 9న సెక్రెటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను శాఖలవారీగా ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







