దోహాలో ముగిసిన అతిపెద్ద ఔట్ డోర్ సైబర్‌ సెక్యూరిటీ ఈవెంట్‌..!!

- November 15, 2024 , by Maagulf
దోహాలో ముగిసిన అతిపెద్ద ఔట్ డోర్ సైబర్‌ సెక్యూరిటీ ఈవెంట్‌..!!

దోహా: వైట్ హ్యాట్ డెసర్ట్ (WHD) భాగస్వామ్యంతో జరిగిన మషీరెబ్‌(Msheireb) ప్రాపర్టీస్ మొట్టమొదటి ఔట్ డోర్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో వివిధ రంగాలు చెందిన 1500 మందికి పైగా పాల్గొన్నారు.  "ఖతార్‌లో స్మార్ట్ టెక్ లీడర్‌గా  సమాజంలో సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ భద్రతను పరిచయం చేయడానికి మా నిబద్ధతలో భాగంగా ఈ అద్భుతమైన సైబర్‌ సెక్యూరిటీని హోస్ట్ చేశాము." అని Msheireb ప్రాపర్టీస్‌లోని సీనియర్ ICT మేనేజర్ ఎంగ్ అహ్మద్ అల్ కోర్బి అన్నారు. 650,000కి పైగా కనెక్ట్ చేయబడిన IoT పరికరాలు,  అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో కూడిన తమ అధునాతన నెట్‌వర్క్ ద్వారా, ఆధునిక పట్టణ పరిసరాలలో సైబర్ భద్రత క్లిష్టమైన ప్రాముఖ్యతను తెలియజేశారు.  ఎమర్జింగ్ థ్రెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్,  సైబర్ స్ట్రాటజీ సేషన్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖతార్ సైంటిఫిక్ క్లబ్ రోబోటిక్స్,  ఎలక్ట్రానిక్స్‌లో వినూత్న ప్రదర్శనలను ప్రదర్శించారు. సాయంత్రం సెషన్ బరాహత్ మషీరెబ్‌ను ఇంటరాక్టివ్ టెక్నాలజీ లో పోటీలు, ప్రదర్శనలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com