యునెస్కో ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో అబో నోగ్తా కోటలు..!!
- November 16, 2024
రియాద్: అసిర్ ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక పట్టణం తబాబ్లోని అబో నోగ్తా కోటలను 2024 ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ప్రకటించింది. సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ సమక్షంలో కొలంబియాలోని కార్టజీనాలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జాబితాలో అబో నోగ్తా కోటలను చేర్చడం పట్ల అల్-ఖతీబ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు సౌదీ అరేబియాలోని విభిన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అబో నోగ్తా కోటల ఛైర్మన్ సయీద్ బిన్ సౌద్ అబో నోగ్తా అల్-ముతాహిమి స్మారక బహుమతిని అందుకున్నారు. అసిర్లోని చారిత్రాత్మక పట్టణం తబాబ్లో ఉన్న అబో నోగ్తా కోటలు ఈ ప్రాంతంలోని అత్యంత ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా నిలిచాయి. ఈ కోటల నిర్మాణానికి తెల్లటి పాలరాతి రాయితోపాటు స్థానిక రాతి రాళ్లను ఉపయోగించి నిర్మించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







