దుబాయ్ రాఫిల్ డ్రా..24K గోల్డ్ ప్లేటేడ్ టెస్లా సైబర్‌ట్రక్‌ను గెలుచుకోండిలా..!!

- November 16, 2024 , by Maagulf
దుబాయ్ రాఫిల్ డ్రా..24K గోల్డ్ ప్లేటేడ్ టెస్లా సైబర్‌ట్రక్‌ను గెలుచుకోండిలా..!!

దుబాయ్: దుబాయ్ లో మొదటి 24K గోల్డ్ ప్లేటేడ్ సైబర్‌ట్రక్‌ను నడపాలనుకుంటున్నారా? దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్‌టెన్షన్ డ్రా విజేతకు దీనిని అందజేయనున్నారు. నవంబర్ 14 నుండి డిసెంబరు 29 వరకు అవుట్‌లెట్‌లలో ఖర్చు చేసే ప్రతి Dh500కి, ఈ ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని గెలుచుకునే అవకాశం కోసం ఒక రాఫిల్ టిక్కెట్‌ను పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.  బంగారు పూతతో ఉన్న ఈ సైబర్‌ట్రక్ ధర మార్కెట్లో దాదాపు Dh490,000 ఉంది.  దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్‌టెన్షన్ డీరా ఎన్‌రిచ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో దాదాపు 300 షాపులు ఉన్నాయి. వీటిల్లో షాపింగ్ చేయడం ద్వారా రాఫిల్ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com