24 గంటల్లో 26 వాహనాలను సీజ్ చేసిన దుబాయ్ పోలీసులు..!!

- November 16, 2024 , by Maagulf
24 గంటల్లో 26 వాహనాలను సీజ్ చేసిన దుబాయ్ పోలీసులు..!!

దుబాయ్: 24 గంటల వ్యవధిలో దుబాయ్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన అనేక వాహనాలను సీజ్ చేశారు. అల్ ఖవానీజ్ ప్రాంతంలో పెద్ద శబ్దాలు, ఇతర నిబంధనలు పాటించని 23 వాహనాలతోపాటు మూడు మోటర్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ పోలీస్‌లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 24 ట్రాఫిక్ జరిమానాలు జారీ చేయబడ్డాయని, స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడిచిపెట్టేందుకు జరిమానా కింద ఒక్కో వాహనానికి 10,000 దిర్హామ్‌ల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు.  ఇంజన్ స్పీడ్‌ను పెంచే సాంకేతిక టెక్నాలజీ వాహనాలకు అమర్చడం, శబ్దం, ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించడం, నివాస ప్రాంతాల్లోని నివాసితులకు ప్రమాదం కలిగించడం వంటి వాటికి వ్యతిరేకంగా డ్రైవర్లను ఆయన హెచ్చరించారు. తమ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు లేదా ప్రజల భద్రతకు లేదా రోడ్లకు హాని కలిగించే నిర్లక్ష్యమైన, అజాగ్రత్త డ్రైవింగ్‌కు పాల్పడే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.  దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న 'పోలీస్ ఐ' లేదా 'వి ఆర్ ఆల్ పోలీస్' సేవల ద్వారా లేదా 901కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదులు చేయాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com