జాబ్ లాస్, నేరాల కంటే యూఏఈ నివాసితులను యాక్సిడెంట్లు భయపెడుతున్నాయా?

- November 16, 2024 , by Maagulf
జాబ్ లాస్, నేరాల కంటే యూఏఈ నివాసితులను యాక్సిడెంట్లు భయపెడుతున్నాయా?

యూఏఈ: జాబ్ లాస్, నేరాలు, పెరుగుతున్న ధరల వంటి ఆర్థిక సమస్యల కంటే రోడ్డు ప్రమాదాల గురించే యూఏఈ నివాసితులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారట.  ఈ మేరకు భద్రతపై నిర్వహించిన ఇటీవలి సర్వే స్పష్టం చేసింది. లాయిడ్ రిజిస్ట్ ఫౌండేషన్ వరల్డ్ పోల్ ప్రకారం.. యూఏఈలో 28 శాతం మంది రోడ్డు ప్రమాదాలను మొదటి ప్రమాదంగా పేర్కొన్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.  8 శాతం మంది వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై.. 5 శాతం మంది గృహ హింస, ఇతర నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 4 శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. 2 శాతం మంది మాత్రమే వాతావరణ మార్పులు, వరదలు, కరువు సంబంధిత సమస్యలను ప్రస్తావించారు. రాజకీయ అస్థిరత, అవినీతిపై కేవలం ఒక శాతం మంది మాత్రమే ఆందోళన వ్యక్తం చేశారు.  గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ గాలప్ నిర్వహించిన ఈ సర్వేలో యూఏఈతో సహా 142 దేశాలలో  147,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి విశ్లేషించారు. 

యూఏఈ అంతర్గత మంత్రిత్వ శాఖ (MOI) డేటా ప్రకారం..  రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 3 శాతం పెరిగింది. 2023లో దేశవ్యాప్తంగా 352 రోడ్డు మరణాలు నమోదయ్యాయి. 2022లో నమోదైన 343 మరణాల కంటే తొమ్మిది మంది ఎక్కువగా మరణించారు. అయితే, 2021లో నమోదైన 381 మరణాలతో పోలిస్తే గత సంవత్సరం 8శాతం మరణాలు తగ్గడం గమనార్హం.   ఇక సర్వే ప్రకారం, 76 శాతం మంది పెద్దలు రోడ్డు సంబంధిత ప్రమాదాలు తమకు తీవ్రమైన హాని కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com