సౌదీ అరేబియాలో ఇతర దేశాల చిహ్నాలు, లోగోల పై నిషేధం..!!

- November 17, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో ఇతర దేశాల చిహ్నాలు, లోగోల పై నిషేధం..!!

రియాద్: ఇతర దేశాలకు చెందిన చిహ్నాలు,  లోగోలు, అలాగే మతపరమైన చిహ్నాలను సౌదీ అరేబియాలో వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని నిషేధించారు. ఈ మేరకు సౌదీ వాణిజ్య మంత్రి డాక్టర్ మజేద్ అల్-కసాబీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చిహ్నాలు, లోగోల దుర్వినియోగాన్ని నిరోధించడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వాణిజ్య సంస్థలపై నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అయితే, సౌదీ అరేబియా జెండాను వాణిజ్య పరంగా ఉపయోగించడంపై మంత్రిత్వ శాఖ గతంలోనే నిషేధం విధించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com