ఒమన్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణం..భారతీయులు టాప్..!!
- November 17, 2024
మస్కట్: సెప్టెంబర్ 2024 చివరి నాటికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణీకుల సంఖ్య 5.1 శాతం పెరిగింది. 80,521 విమానాల్లో 11,102,451 మిలియన్ల మంది ప్రయాణికులు ఒమన్ గుండా ప్రయాణించారు. 2023,సెప్టెంబర్ నాటికి ప్రయాణించిన వారి సంఖ్య 10,565,754 మిలియన్లుగా ఉంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నివేదికను జారీ చేసింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య గత సెప్టెంబర్ చివరి నాటికి 9.7 మిలియన్లు(4.7 శాతం పెరుగుదల), విమానాల సంఖ్య73,137(3.4శాతం పెరుగుదల) నమోదైంది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 66,207 అంతర్జాతీయ విమానాలు, 8,846,484 మిలియన్ల మంది ప్రయాణీకులతోపాటు 6,930 దేశీయ విమానాలు, 918,046 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.
సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య 1,230,326కి(6.8 శాతం పెరుగుదల), విమానాల సంఖ్య 8,374 (0.6 శాతం తగ్గుదల)గా ఉంది. ఇక సలాలా విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 4,110 కాగా, ప్రయాణికు సంఖ్య 542,327 గా ఉంది. దేశీయ విమానాల సంఖ్య 4,264, 687,999 మంది ప్రయాణికులు ప్రయాణించారు. సోహార్ విమానాశ్రయం ద్వారా 544 విమానాలలో 62,842 మంది ప్రయాణీకులకు చేరుకోగా, దుక్మ్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 466 విమానాల్లో 44,753 మందికి చేరుకుంది.
కాగా, మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరలివెళ్లిన ప్రముఖ జాతీయుల విషయానికొస్తే, భారత్ మొత్తం 149,561 మంది ప్రయాణీకులతో (79,097 మంది రాగా, 70,464 మంది బయలుదేరారు) టాఫ్ లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ మొత్తం 104,509 మంది ప్రయాణికులు (52,517/51,992), పాకిస్థాన్ మొత్తం 47,103 మంది ప్రయాణికులు (25,114/21,989) ఉన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







