మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో ప్రీమేచ్యూరిటీ డే 2024 ఘనంగా నిర్వహణ
- November 17, 2024
హైదరాబాద్: మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, "సెలబ్రేటింగ్ టైనీ మిరాకల్స్: ప్రీమేచ్యూరిటీ డే 2024" అనే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ప్రీటర్మ్ బేబీల జీవితాల్లోని ఆశ్చర్యకర ప్రయాణాలను గౌరవిస్తూ, వైద్య నిపుణులు, తల్లిదండ్రులు, సమాజాన్ని ఒకచోట కలిపే ఈ కార్యక్రమానికి సీనియర్ నియోనాటాలజిస్టు డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే ఆధ్వర్యం వహించారు. మెడికవర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రి నియోనేటల్ కేర్ యొక్క అభివృద్ధి పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రీటర్మ్ బేబీల తల్లిదండ్రులు వారి ఈ యొక్క కార్యక్రమం "వెల్కమ్ బ్యాక్" ద్వారా వారి అనుభవాలను తెలియచేస్తూ మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ డాక్టర్స్ వారి కుటుంభంలో ఎంత ఆనందాన్నినింపారో తెలియచేస్తూ ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ద్వారా మరొక్కసారి కుటుంబాల చిరునవ్వులు చిందించే "ఇన్స్టంట్ ఫోటో ఫ్రేమ్ కార్నర్" ఏర్పాటు చేయబడింది. కుటుంబాలు తమ బిడ్డలతో మరియు వైద్య బృందంతో ఉన్న మధుర జ్ఞాపకాలను ఫోటోలుగా ముద్రించుకొని సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ ఫోటోలు "మిరాకల్స్ ఎట్ మెడికవర్" అనే థీమ్‌కి నిలువెత్తు ప్రమాణాలుగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో హృదయాన్ని హత్తుకునే మరో ప్రధాన ఆకర్షణగా "ఫుట్‌ప్రింట్స్ ఆఫ్ కరేజ్" వాల్‌ను ఆవిష్కరించారు. చిన్న పాద ముద్రలు, వారి పేర్లు, పుట్టిన తేదీలతో అలంకరించిన ఈ వాల్ మెడికవర్ నియోనేటల్ కేర్ సమర్థతను చాటిచెప్పింది.డాక్టర్ రవీందర్ రెడ్డి పెరిగే మాట్లాడుతూ నెలలు నిండకుండా అంటే 23 నుంచి 37వారాల లోపే పుట్టే పిల్లలందరినీ ‘ప్రి మెచ్యూర్ అని, 28 వారాల లోపే పుట్టే పిల్లలు ‘ఎక్స్ట్రీమ్ ప్రి మెచ్యూర్’ బేబీస్ అని అంటారు. వీళ్ళు పుడుతూనే అనారోగ్య సమస్యలు వెంట తెచ్చుకోవడంతోపాటు ఎదిగే క్రమంలో కూడా ఎన్నో రకాల సమస్యలకు లోనవుతారు.తల్లి నుండి పొందే సమృద్ధి పోషణను కోల్పోతారు. 34 వారాల కంటే ముందుగా పుట్టిన పిల్లలు నేరుగా తల్లి పాలు తీసుకోలేరు. శ్వాసకోశ, హీమోడైనమిక్ అస్థిరత, అసిడోసిస్, సెప్సిస్ మొదలైన అవలక్షణాలు కలిగివుంటారు మరియు షుగర్ లెవెల్స్, శరీర ఉష్ణోగ్రతలను క్రమంలో పెట్టాలి.లేదంటే, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా పిల్లలను ఇంక్యుబేటర్‌లో/ వార్మర్లో ఉంచి అవసరం పడితే వెంటిలేటర్ సహాయంతో వైద్యం అందించగలుగుతారు.కొందరు పిల్లలకు మెదడులో రక్తస్రావమై బ్రెయిన్ హెమరేజ్‌కు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది.ఈ పిల్లలు నేరుగా తల్లుల ఫీడ్‌ను తీసుకోవడానికి అభివృద్ధి చేసే వరకు, వారికి NICUలోని ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ (EBM) తాగిస్తారు అని అన్నారు. నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉన్న గర్భిణులు ముందుగానే పిల్లలకు అందించవలసిన వైద్య సౌకర్యాలు, అనుభవజ్ఞులైన డాక్టర్స్ కలిగి ఉన్న హాస్పిటల్ ని సంప్రదించాలి. ప్రి మెచ్యూర్ పిల్లలకి ఆకస్మిక మరణ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది ఇటువంటి పిల్లలు నిద్రలోనే చనిపోతారనే విషయం తెలిసిందే. అందువల్ల, అటువంటి పిల్లలని పెరిగి పెద్దవారు అయ్యేదాకా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని అన్నారు. అటువంటి పిల్లల ముందు ఇంట్లో స్మోకింగ్ చేయడాన్ని మానుకోండి అని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మెడికవర్ ఆసుపత్రి ప్రీమేచ్యూరిటీపై అవగాహన పెంపొందించడంలో, నియోనేటల్ కేర్‌లో వారి అంకితభావాన్ని చాటిచెప్పింది.ప్రపంచ స్థాయి వైద్య సేవలపై ఆసుపత్రి నిబద్ధతను మరింత స్పష్టంగా పరిచయం చేసింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నవిత, డాక్టర్ వంశీ, డాక్టర్ రాధిక, డాక్టర్ SV లక్ష్మి , డాక్టర్ మధుమోహన్ రెడ్డి ,డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







