సీతాఫలం ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి

- November 17, 2024 , by Maagulf
సీతాఫలం ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి

సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం ఎన్నో ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి.ఈ ఫలంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి.

అయితే, సీతాఫలం పండులోనే కాదు.. సీతాఫలం చెట్టు ఆకుల్లో కూడా బోలెడు పవర్ ఉంది. ఈ ఆకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సీతాఫలం ఆకులు డయాబెటిస్ పేషంట్లకు ఓ వరం అని చెప్పవచ్చు. ఈ ఆకులు రక్తంలో షుగర్ స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరగబెట్టి.. ఆ నీటిని తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది ఇన్సూలిన్‌గా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

సీతాఫలం ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధుల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఈ ఆకును మెత్తగా పేస్టులా చేసి చర్మంపై అప్లై చేయాలి. మొటిమలు, ఎర్ర దద్దుర్లు, మంట, తామర వంటి లక్షణాల్ని ఈ పేస్టు అప్లై చేయడం వల్ల తగ్గుముఖం పడతాయి. చలికాలంలో ఈ పేస్టు ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు. ముఖం నిగనిగలాడుతుంది.

సీతాఫలం ఆకులో పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వెల్లడిస్తున్నారు. సీతాఫలం ఆకులు యాంటీ స్టెపిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో.. ఈ ఆకులు గాయాలు త్వరగా మానేందుకు సాయపడతాయి. ఈ ఆకుల్ని పేస్టులా చేసి గాయాలపై అప్లై చేస్తే అవి ఇన్ఫెక్షన్ బారిన పడవు. అంతేకాకుండా త్వరగా మానిపోతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

సీతాఫలం ఆకులు జీర్ణసమస్యల్ని తగ్గించడంలో సాయపడతాయి. ఈ ఆకుల్ని నీటి కాచి.. వడకట్టి తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకుల నుంచి కాషాయం లేదా టీ చేసుకుని తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

సీతాఫలం ఆకుల్ని ఆయుర్వేదంలో దంత సమస్యలకు మంచి పరిష్కారమని చెబుతారు. దంతాలు ఇన్ఫెక్షన్లు, దంత క్షయం, బ్యాక్టీరియా వంటి వాటిని ఈ ఆకులు నయం చేస్తాయి. ఇందుకోసం సీతాఫలం ఆకుల్ని నమాలాలి. దీంతో.. దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి శుభ్రతను కూడా ఈ ఆకులు మెరుగుపరుస్తాయి.

కీళ్ల నొప్పులు, వాపుల నివారణలో సీతాఫలం ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకుల్ని మెత్తగా నూరి పేస్టులా చేసి కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న దగ్గర అప్లై చేయాలి. దీంతో.. కీళ్ల నొప్పులు, వాపులకు పరిష్కారం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులు, మంటను తగ్గిస్తాయి. శరీరంలో విషపూరిత పదార్థాలను బయటకు పంపడంలో సీతాఫలం ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com