దుబాయ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- November 17, 2024
దుబాయ్: దుబాయిలో సైకోట్రోపిక్ పదార్ధాల అక్రమ రవాణా కేసులో దోషిగా నిర్ధారించబడిన ఒక వ్యక్తికి దుబాయ్‌లోని క్రిమినల్ కోర్ట్ జీవిత ఖైదు విధించింది. ఎమిరేట్స్ లో జీవిత ఖైదు సాధారణంగా 25 సంవత్సరాలు ఉంటుంది. దీంతో పాటు 47 ఏళ్ల మలేషియా జాతీయుడికి Dh200,000 జరిమానా విధించారు. అతని జైలు శిక్ష పూర్తయిన దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15, 2023 నవిమానాశ్రయ అధికారులు బెల్జియం నుండి షిప్‌మెంట్ లో వాటర్ ఫిల్టర్‌లో దాచిన 2,892 గ్రాముల తెల్లటి పొడిని గుర్తించారు. ఆ తర్వాత, దక్షిణాఫ్రికా నుండి ఫిబ్రవరి 28, 2024న రెండవ షిప్‌మెంట్ వచ్చింది. ఈసారి "కాఫీ, చాక్లెట్, స్వీట్స్" అని లేబుల్ చేయబడిన ప్యాకేజీగా ఉంది. నాలుగు ప్లాస్టిక్ కంటైనర్లలో బ్రౌన్ పౌడర్ కింద దాచిపెట్టిన సుమారు 3,638 గ్రాముల తెల్లటి పొడిని తనిఖీల్లో గుర్తించారు. ఫోరెన్సిక్ విశ్లేషణ లో అది కెటామైన్ పదార్తంగా నిర్ధారించారు. మార్చి 19, 2024న నిందితుడు రెండవ షిప్‌మెంట్‌ను సేకరించడానికి దుబాయ్‌లోని అరామెక్స్ అల్ జహ్రా బ్రాంచ్‌కు రాగా, కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







