కువైట్ లో 385 అరెస్ట్.. 497 మందిపై బహిష్కరణ వేటు..!!

- November 18, 2024 , by Maagulf
కువైట్ లో 385 అరెస్ట్.. 497 మందిపై బహిష్కరణ వేటు..!!

కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. గత నాలుగు రోజుల్లో 385 మందిని అరెస్టు చేయగా, 497 మందిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. నవంబర్ 11 -14 తేదీల మధ్య దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు.  చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికులతోపాటు వారిని తీసుకొచ్చిన వ్యక్తులతో సహా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com