దుబాయ్ బీచ్‌లో ఈత కొడుతూ.. 15 ఏళ్ల యువకుడు మృతి..!!
- November 18, 2024
యూఏఈ: దుబాయ్ లో విషాదం చోటుచేసుకుంది. అల్ మమ్జార్ బీచ్ లో ఈత కొడుతుండగా 15 ఏళ్ల భారతీయ ప్రవాసుడు చనిపోయాడు. దుబాయ్‌లోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అహ్మద్ అబ్దుల్లా మఫాజ్ శుక్రవారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బీచ్ కు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
"అతను తన స్నేహితులతో బయటకు వెళ్ళాల్సి ఉండే, మాతో రావాలని కోరగా వచ్చాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదు" అని అతని తండ్రి మహ్మద్ అష్రఫ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒడ్డున ఆడుకుంటుండగా, భారీ కెరటం వాడిని చూస్తుండగానే సముద్రంలో కొట్టుకుపోయాడని విలపించాడు.
ఇదిలా ఉండగా, భయాందోళనకు గురైన కుటుంబం సహాయం కోసం కేకలు వేసిందని, సమీపంలో ఉన్న అరబ్ ఈతగాడు వారికి సహాయం వచ్చాడని, అతను మఫాజ్ సోదరిని రక్షించగలిగాడు, కానీ ఆ బాలుడు అప్పటికి కొట్టుకుపోయాడని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్లో సామాజిక కార్యకర్త, వాలంటీర్ ఇబ్రహీం బెరికే చెప్పారు. శుక్రవారం సాయంత్రం బాలుడి కోసం వెతకగా, శనివారం మృతదేహాం లభ్యమైంది. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నారు. చనిపోయిన బాలుడు నలుగురు తోబుట్టువులలో మూడవవాడని అతడి బంధువులు తెలిపారు. ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత బాలుడికి దుబాయ్‌లోనే అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







