దుబాయ్ బీచ్‌లో ఈత కొడుతూ.. 15 ఏళ్ల యువకుడు మృతి..!!

- November 18, 2024 , by Maagulf
దుబాయ్ బీచ్‌లో ఈత కొడుతూ.. 15 ఏళ్ల యువకుడు మృతి..!!

యూఏఈ: దుబాయ్ లో విషాదం చోటుచేసుకుంది. అల్ మమ్జార్ బీచ్ లో ఈత కొడుతుండగా 15 ఏళ్ల భారతీయ ప్రవాసుడు చనిపోయాడు. దుబాయ్‌లోని న్యూ ఇండియన్ మోడల్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న అహ్మద్ అబ్దుల్లా మఫాజ్ శుక్రవారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బీచ్ కు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

"అతను తన స్నేహితులతో బయటకు వెళ్ళాల్సి ఉండే, మాతో రావాలని కోరగా వచ్చాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదు" అని అతని తండ్రి మహ్మద్ అష్రఫ్ కన్నీటి పర్యంతమయ్యారు.  ఒడ్డున ఆడుకుంటుండగా, భారీ కెరటం వాడిని చూస్తుండగానే సముద్రంలో కొట్టుకుపోయాడని విలపించాడు.

ఇదిలా ఉండగా, భయాందోళనకు గురైన కుటుంబం సహాయం కోసం కేకలు వేసిందని, సమీపంలో ఉన్న అరబ్ ఈతగాడు వారికి సహాయం వచ్చాడని, అతను మఫాజ్ సోదరిని రక్షించగలిగాడు, కానీ ఆ బాలుడు అప్పటికి కొట్టుకుపోయాడని  కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్‌లో సామాజిక కార్యకర్త, వాలంటీర్ ఇబ్రహీం బెరికే చెప్పారు.  శుక్రవారం సాయంత్రం బాలుడి కోసం వెతకగా, శనివారం మృతదేహాం లభ్యమైంది. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నారు. చనిపోయిన బాలుడు నలుగురు తోబుట్టువులలో మూడవవాడని అతడి బంధువులు తెలిపారు.  ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత బాలుడికి దుబాయ్‌లోనే అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com