టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

- November 18, 2024 , by Maagulf
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపు కూడా రద్దు చేసింది. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేసింది. తిరుమలలోని శారదా పీఠం భవనాలు పూర్తిగా కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం పై నిషేధం విధించారు.

టీటీడీ కీలక నిర్ణయాలు..

  • శ్రీవాణి ట్రస్ట్ రద్దు
  • తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం
  • టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం
  • ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
  • టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగుల తొలగింపు
  • ఇతర డిపార్ట్ మెంట్లకు అన్యమత ఉద్యోగులను తరలింపు
  • తిరుమల ఫ్లైఓవర్ కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ
  • మూడు నెలల్లో డంపింగ్ యార్డు తరలించాలని డెసిషన్
  • లడ్డూ ప్రసాదంలో మరింత నాణ్యత పెంచాలని నిర్ణయం
  • ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం
  • టీటీడీలో ఉద్యోగులకు 10శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం
  • టూరిజం శాఖకు ఇచ్చే 4వేల టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం
  • ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం
  • శారదా పీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకోవాలని టీటీడీ నిర్ణయం


ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన పాలక మండలి తొలి సమావేశంలో పలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ ను పాలక మండలి రద్దు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ నిధులను టీటీడీ ముఖ్య ఖాతాకు మళ్లించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వం రూ.10వేలకు ఒక టికెట్ ను విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ఆలయాల నిర్మాణం కోసం వినియోగిస్తామని గత పాలక మండలి ప్రకటించింది. అయితే, దీనిపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ నిధులన్నీ పక్కదారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొత్త పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ పైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టి.. ఆ ట్రస్ట్ ను రద్దు చేసింది. ఆ నిధులన్నీ టీటీడీ ప్రధాన ఖాతాకు మళ్లించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు టీటీడీ నిధులను ప్రైవేట్ బ్యాంకులలో డిపాజిట్ చేస్తూ వచ్చారు. ఇకపై అలా డిపాజిట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com