14 రోజుల రిమాండ్‌లో కస్తూరి
- November 18, 2024
చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళ నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కస్తూరి ఈనెల 29 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమెను హైదరాబాద్‌లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 3న చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సమాజ సమ్మేళనంలో కస్తూరి తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఆమెను జైలుకు పంపేలా చేశాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







