ప్రపంచ సవాళ్లకు G20 సమ్మిట్ ఫలితాలతో పరిష్కారాలు..!!

- November 19, 2024 , by Maagulf
ప్రపంచ సవాళ్లకు G20 సమ్మిట్ ఫలితాలతో పరిష్కారాలు..!!
దోహా: శాంతి, శ్రేయస్సును ఆనందించే భవిష్యత్తును నిర్మించడానికి అత్యవసర ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడంలో G20 సమ్మిట్ ఫలితాలు దోహదపడతాయని అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక X ఖాతాలోని పోస్ట్‌లో వెల్లడించారు. HH అమీర్ ఈరోజు నవంబర్ 18న రియో డి జనీరోలో "బిల్డింగ్ ఎ ఫెయిరర్ వరల్డ్ అండ్ ఎ సస్టైనబుల్ ప్లానెట్" అనే థీమ్‌తో జరిగిన G20 సమ్మిట్‌లో పాల్గొన్నారు. ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యలను ప్రస్తావించిన ఈ గ్లోబల్ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకు ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ప్రెసిడెంట్ HE లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు హిస్ హైనెస్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com