జపాన్ పై ఘన విజయం..ఫైనల్స్ కు చేరిన భారత్ !
- November 19, 2024
బీహార్: మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2024లో భారత మహిళల జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. బీహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈరోజు (మంగళవారం) జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 2-0 పాయింట్ల తేడాతో జపాన్‌ను ఓడించి అజేయంగా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాయి. దీంతో 0-0తో ద్వితీయార్థంలోకి అడుగుపెట్టిన రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
కాగా, ద్వితీయార్థంలో భారత జట్టు రెండు గోల్స్ చేసి ఆధిక్యం సాధించింది. మ్యాచ్ 48వ నిమిషంలో నవనీత్ గోల్ చేయగా… ఎనిమిది నిమిషాల తర్వాత, 56′ లాల్‌రెమ్సియామి భారత్‌కు మరో గోల్ అంధించింది. దీంతో భారత మహిళల జట్టు జపాన్ పై 2–0తో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది.
మరో సెమీఫైనల్‌లో మలేషియా – చైనా తలపడగా.. చైనా విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. కాగా, ఈ నెల 20న జరిగే ఫైనల్లో భారత్ మరోసారి చైనాతో ఢీ కోననుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







