ఈ పాలు తాగితే చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరం కావచ్చు
- November 20, 2024
చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చలికాలంలో శరీరం అంత యాక్టివ్‌గా ఉండదు. చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన పవర్ అందించాలి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాల్ని డైట్‌లో చేర్చుకోవాలి. చలికాలంలో శరీరానికి కావాల్సిన శక్తిని అందించి.. ఇమ్యూనిటీ పవర్ పెంచే డ్రింక్స్ తాగాలి. ఈ చలికాలంలో లవంగాల పాలు తాగితే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ వంటగదిలో ఆహార రుచిని పెంచే అనేక మసాలాలు ఉన్నాయి. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ మసాలాలలో ఒకటి లవంగం. ఇది ఆహార రుచిని రెట్టింపు చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. లవంగాలను పాలలో కలుపుకుని తాగితే మరింత ప్రయోజనాలు శరీరానికి చేకూరతాయి. లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ పాలతో కలిపినప్పుడు వాటి ప్రభావం చాలా రెట్లు పెరుగుతుంది. లవంగం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మంది రక్తపోటు, హై బీపీతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు.. లవంగం పాలు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించే లక్షణాలు లవంగాల్లో ఉన్నాయి. అందుకే బీపీ రోగులు లవంగాల పాలు తాగాలి. ప్రతి రోజూ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం, కడుపునొప్పి వంటి కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారు లవంగం పాలు తాగాలి. లవంగాల పాలు తాగితే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. పొట్టను శుభ్రపరచడంలో లవంగాలు సాయపడతాయి. లవంగాల్ని పాలులో కలిపి తాగితే జీవ క్రియ వేగవంతం అవుతుంది.
లవంగం పాలు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరి అలసట, బద్ధకం తొలగిపోతాయి. ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం శరీరంలో కొత్త శక్తిని నింపుతాయి. చలికాలంలో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులను తట్టుకోవడానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది సూపర్ డ్రింక్.
లవంగాలలో కాల్షియం ఉంటుంది. పాలలో కూడా కాల్షియం ఉంటుంది. ఈ రెండింటిని పాలలో కలిపి తాగడం వల్ల కాల్షియం నాణ్యత పెరుగుతుంది. ప్రతి రోజూ ఈ పాలు తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. పంటి నొప్పి, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన మొదలైన సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒక గ్లాసు పాలు పాత్రలో తీసుకుని గ్యాస్ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోండి. పాలులో కొన్ని లవంగాల్ని వేయండి. రుచికి కాస్త బెల్లం జోడించండి. పాలు బాగా మరిగిన తర్వాత వడకట్టి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. లవంగాల్ని పొడి చేసుకుని కూడా పాలులో కలుపుకోవచ్చు. ప్రతి రోజూ ఈ పాలు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కావాలనుకుంటే మీరు చిటికెలు పసుపు కూడా కలుపుకోవచ్చు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!