రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్
- November 20, 2024
వేములవాడ: దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 127.65 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం కు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ లు పుష్పగుచాల అందించి స్వాగతం పలికారు. అనంతరం సీఎం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
తర్వాత రాజన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభాన్ని దర్శించుకుని కోడే మొక్కలు చెల్లించారు. లక్ష్మి గణపతి ని దర్శించుకున్న అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వామి వారి చిత్రపటాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







