బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారు..
- June 25, 2016
కమల్ హాసన్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న 'శభాష్ నాయుడు' సినిమా షూటింగు జోరుగా సాగుతోంది. దీనికోసం బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారట. వీళ్లిద్దరివీ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలని, అమెరికాలో కొనసాగుతున్న షూటింగులో వీళ్లిద్దరూ పాల్గొంటున్నారని సినిమా వర్గాలు తెలిపాయి. వాళ్ల పాత్రల చిత్రీకరణతో ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ పూర్తయిందని, వాళ్ల పాత్రల షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్తారని చెప్పారు.దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర పోషించిన కమల్.. అదే పాత్రను ప్రధాన పాత్రగా తీసుకుని దానికి సీక్వెల్ లా ఈ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగుతో కూడా బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో కమల్ భార్య పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల కుమార్తెగా కమల్ కూతురు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. సినిమాకు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే, డిసెంబర్ 1న సినిమా విడుదలవుతుంది.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







