నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS మాజీ అధ్యక్షుడు మంచికలపూడి

- November 22, 2024 , by Maagulf
నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS మాజీ అధ్యక్షుడు మంచికలపూడి

మిస్సోరీ: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.నాట్స్ జాతీయ నాయకత్వం అండదండలతో మిస్సోరీ చాప్టర్ నూతన కార్యవర్గం ముందుకు సాగనుంది.నాట్స్ సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ బోర్డ్  డైరక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ సోషల్ మీడియా నేషనల్ కో-ఆర్డినేటర్ సంకీర్త్ కటకంల పర్యవేక్షణలో మిస్సోరీ నూతన కార్యవర్గం పనిచేయనుంది. మిస్సోరి చాప్టర్ కో-ఆర్డినేటర్‌ గా సందీప్ కొల్లిపర, జాయింట్ కో ఆర్డినేటర్‌గా అన్వేష్ చాపరాల లను నాట్స్ నాయకత్వం నియమించింది. 

నాట్స్ మిస్సోరీ సభ్యత్వ నమోదు చైర్ తరుణ్ దివి, క్రీడా వ్యవహారాలు  చైతన్య పుచ్చకాయల,  కార్యక్రమాల నిర్వహణ నవీన్ కొమ్మినేని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హరీశ్ గోగినేని, నిధుల సేకరణ శ్రీకాంత్ కొండవీటి, వెబ్ & మీడియా చైర్ రాకేష్ రెడ్డి మరుపాటి, యువజన కార్యక్రమాలు హరి నెక్కలపు, సాంస్కృతిక అంశాలు మధుసూదన్ దద్దాల, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ యుగేందర్ చిలమకూరి, ఇమ్మిగ్రేషన్ చైర్ మురళీ బండారుపల్లి, హాస్పిటాలిటీ చైర్ నరేష్ రాయంకుల, హాస్పిటాలిటీ కో చైర్ సునీల్ సి స్వర్ణ, హెల్ప్ లైన్ చైర్ దేవి ప్రసాద్, హెల్ప్ లైన్ కో చైర్ చైతన్య అప్పని లకు బాధ్యతలు అప్పగించింది. 

నాట్స్ మిస్సోరీ చాప్టర్ 2.0 కు అప్పలనాయుడు గండి, శివకృష్ణ మామిళ్లపల్లి, మధు సామల, కవిత ములింటి లను సలహాదారులుగా నియమించింది. 

ఈ కమిటీల సభ్యులందరూ, మిస్సోరి నాట్స్ సభ్యులకు అండగా నిలవనున్నారు. 
నాట్స్ మిస్సోరీ నూతన కార్యవర్గానికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు. మిస్సోరీలో నాట్స్ ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు నాట్స్ మిస్సోరీ టీం కృషి చేయాలని వారు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com