త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల

- November 22, 2024 , by Maagulf
త్వరలో ఆర్టీసీలో 7వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌: ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేష‌న్ (APSRTC)లో భారీగా ఉద్యోగాల నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్‌ ఛైర్మన్‌గా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉద్యోగాల భర్తీపై సమాచారాన్ని వెల్లడించారు. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా విద్యుత్తు బస్సులు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. అందిన సమచారాం మేరకు ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీల‌పై వివ‌రాల‌ను ప్రభుత్వానికి స‌మ‌ర్పించింది. 18 కేట‌గిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.

కేట‌గిరీల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డ్రైవ‌ర్ పోస్టులు 3,673, కండ‌క్టర్ పోస్టులు 1,813, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు 656, అసిస్టెంట్ మెకానిక్‌, శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూప‌ర్ వైజ‌ర్ ట్రైనీ పోస్టులు 207, మెకానిక‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూప‌రింటెండెంట్ పోస్టులు 280 వరకు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com