నవంబర్ 24 నుండి అమల్లోకి 2 కొత్త టోల్ గేట్లు..!!
- November 24, 2024
దుబాయ్: బిజినెస్ బే గేట్ , అల్ సఫా సౌత్ గేట్ వద్ద ఏర్పాటైన రెండు కొత్త సాలిక్ గేట్లు నవంబర్ 24 నుండి పనిచేయనున్నాయి. అల్ ఖైల్ రోడ్‌లోని బిజినెస్ బే క్రాసింగ్ వద్ద ఉన్న రెండు కొత్త టోల్ గేట్లు, అల్ సఫా సౌత్‌లోని అల్ మైదాన్ స్ట్రీట్ , ఉమ్ అల్ షీఫ్ స్ట్రీట్ మధ్య షేక్ జాయెద్ రోడ్లో ఏర్పాటు చేసిన వాటితోకలిపి దుబాయ్‌లోని సాలిక్ గేట్ల సంఖ్య ఎనిమిది నుండి 10కి పెరుగుతుందని ప్రకటించారు. షార్జా, అల్ నహ్దా, అల్ ఖుసైస్ నుండి చాలా మంది వాహనదారులు ఎమిరేట్‌లోని అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటైన అల్ ఖైల్ రోడ్‌ను యాక్సెస్ చేయడానికి ఈ వంతెనను ఉపయోగిస్తున్నందున బిజినెస్ బే అనేది కీలకమని సలిక్ సీఈఓ ఇబ్రహీం అల్ హద్దాద్ పేర్కొన్నారు. కొత్త గేట్లు ట్రాఫిక్‌ను 16 శాతం వరకు తగ్గిస్తాయని తెలిపారు. అల్ ఖైల్ రోడ్లో 12 నుండి 15 శాతం, అల్ రబాత్ స్ట్రీట్‌లో 10 నుండి 16 శాతం, షేక్ జాయెద్ రోడ్ నుండి మేడాన్ స్ట్రీట్ వరకు 15 శాతం ట్రాఫిక్ ను తగ్గిస్తుందన్నారు. కాగా, అల్ సఫా సౌత్ గేట్ అనేది ఇప్పటికే ఉన్న ఉత్తర అల్ సఫా గేట్‌తో అనుసంధానించబడిన టెక్నికల్ గేట్ అని అల్ హద్దాద్ వివరించారు. ఉత్తర మరియు దక్షిణ సఫా గేట్ల గుండా ఒక గంటలోపు ప్రయాణిస్తున్న వారు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందన్నారు.ప్రస్తుతం, నగరం అంతటా ఏదైనా టోల్ గేట్లను వాహనం దాటిన ప్రతిసారీ సాలిక్ నిర్ణీత రుసుము 4 దిర్హామ్‌లను వసూలు చేస్తున్నారు. గత ఏడాది సాలిక్ టోల్ గేట్ల ద్వారా దాదాపు 593 మిలియన్ల వాహనాలు ప్రయాణం సాగించాయి.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







