అల్-హదీత బార్డర్ ద్వారా సౌదీ అరేబియాలోకి భారీగా స్మగ్లింగ్..!!
- November 24, 2024
రియాద్: అల్-హదీత సరిహద్దు క్రాసింగ్ ద్వారా రాజ్యంలోకి క్యాప్గాన్ మాత్రల తరలింపు స్మగ్లింగ్ ను జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) భగ్నంచేసింది.ఐదు వేర్వేరు ప్రయత్నాలను అడ్డుకుని, మొత్తం 313,906 క్యాప్గాన్ మాత్రలను స్వాధీనం చేసుకుంది. అధునాతన కస్టమ్స్ విధానాలు, అత్యాధునిక భద్రతా సాంకేతికత, శిక్షణ పొందిన డాగ్ స్వ్కాడ్ తో ట్రక్కులలోని వివిధ ప్రదేశాలలో దాచిన మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, దేశంలోకి క్యాప్టాగన్ వంటి హానికరమైన పదార్థాల ప్రవేశాన్ని నిరోధించడంలో అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహారిస్తుందని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం ద్వారా స్మగ్లింగ్ను ఎదుర్కోవడంలో పాత్ర పోషించాలని ZATCA ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







