డిసెంబర్ 5 నుండి హిమామ్ మౌంటైన్ రేస్..!!
- November 24, 2024
మస్కట్: ఒమన్ లో ప్రసిద్ధి చెందిన హిమామ్ మౌంటైన్ రన్నింగ్ రేస్ ఐదవ ఎడిషన్ డిసెంబర్ 5 నుండి 7 వరకు నిర్వహించనున్నారు.ఇది అల్ దఖిలియా గవర్నరేట్‌లోని నాలుగు విలాయత్‌లలో జరుగుతుంది.ఒమన్ హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ..అల్ దఖిలియా గవర్నరేట్ సహకారంతో ఈ రేసును నిర్వహిస్తుంది.రేసులో 65 దేశాల నుండి 1,000 మంది పాల్గొంటున్నారు.ఈ పోటీలో 110 కిలోమీటర్లు, 55 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల మూడు ప్రధాన ట్రాక్‌లు ఉన్నాయి.కఠినమైన పర్వత ప్రాంతాల మధ్య అథ్లెట్లు పరుగెత్తాల్సి ఉంటుంది.నిజ్వా, ఇజ్కి, అల్ హమ్రా, అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయాత్‌లలో ఉన్న పర్వతాలు, లోయలు, పచ్చని పొలాల గుండా రేసు సాగనుంది.డిసెంబరు 6, 7 తేదీలలో స్కూల్ స్టూడెంట్స్ కోసం అనుబంధ ఈవెంట్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈవెంట్‌తో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రొత్సాహించేందుకు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







