ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు..!
- November 24, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కానీ.. పీఎంఓ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అనధికార సమాచారం ప్రకారం.. నవంబర్ 29న సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అదే వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.ఈ సభకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏయూలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన బీఈ, బీటెక్, బీఆర్క్ పరీక్షలను ప్రధాని పర్యటన నేపథ్యంలో నవంబర్ 30, డిసెంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఉత్తరాంధ్రలో మరో అతి పెద్ద ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. విశాఖ తిక్కవాని పాలెం లోని ఎన్ టిపిసిలో కీలక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని పెట్టుబడి విలువ రూ. 84 వేల కోట్లపైమాటే. ఈ 29న ఎన్ టి పి సి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందులో స్వయంగా పాల్గొంటారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత ప్రధాని తొలి సారిగా విశాఖ వస్తున్నారు.NTPC, AP GENCOల ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం కాబోతుంది. మూడు దశల్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కు 84,700 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి.దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. ప్రధాని మోదీప పర్యటన సందర్భంగా కీలక ప్రకటనలు టేసే అవకాశం ఉంది. విశాఖ మెట్రోతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రకటన చేయించే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ మొదటి సారి విశాఖ వస్తున్నారు. ఖచ్చితంగా కొన్ని వరాలుంటాయని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. విశాఖకు కావాల్సి న ప్రాజెక్టుల విషయంలో ఆయనకు స్పష్టత ఉంది. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి అవసరమైన సాయాన్ని కేంద్రం నుంచి పొందడానికి ఏ మాత్రం మొహమాటపడే పరిస్థితి ఉండదు. అందుకే వచ్చే ఐదేళ్లలో విశాఖ స్వరూపం మారిపోతుందని ప్రజలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. పూడిమడకలో రూ.85 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న పుననరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. 2032 నాటికి ఈ ప్లాంట్ నుంచి 60 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తులో అధిక భాగం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందులో 50 శాతం వాటాను ఏపీజెన్‌కోతో పెట్టించాలని నిర్ణయించారు. దీంతో ఎన్టీపీసీ, జెన్‌కో సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







