దుబాయ్ రన్ 2024: రిజిస్ట్రేషన్, మెట్రో యాక్సెస్, పార్కింగ్, రూట్ వివరాలు..!!

- November 24, 2024 , by Maagulf
దుబాయ్ రన్ 2024: రిజిస్ట్రేషన్, మెట్రో యాక్సెస్, పార్కింగ్, రూట్ వివరాలు..!!

యూఏఈ: దుబాయ్‌లో ఫిట్‌నెస్ ఈవెంట్‌లలో ఒకటైన దుబాయ్ రన్ గ్రాండ్ ఫినాలేకు సన్నాహాలు పూర్తయ్యాయి. దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ (DFC) కోసం నవంబర్ 24న షేక్ జాయెద్ రోడ్‌ను భారీ ట్రాక్‌గా మారనుంది.   

దుబాయ్ రన్ రోజున పార్కింగ్, మెట్రో యాక్సెస్

రన్నర్లకు వసతి కల్పించేందుకు దుబాయ్ మెట్రో రెడ్, గ్రీన్ లైన్లు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభం కానున్నాయి. అయితే, మీరు డ్రైవింగ్‌ని ఎంచుకుంటే, 5 కి.మీ మార్గంలో పాల్గొనేవారు దుబాయ్ మాల్‌లో పార్క్ చేసి, మెట్రోను వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్టేషన్‌కు వెళ్లవచ్చు. 10కి.మీ విభాగంలో ఉన్న వారికి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మెట్రో ద్వారా ఎమిరేట్స్ టవర్స్ స్టేషన్‌కు యాక్సెస్ కావచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి పార్కింగ్ వివరాలను ఇ-మెయిల్‌ ద్వారా పంపినట్టు నిర్వాహకులు తెలిపారు.

రోడ్డు మూసివేతలు

ఆదివారం ఉదయం వాహనదారుల కదలికలపై ఆంక్షలు విధించారు. ఈవెంట్ కోసం నాలుగు రహదారులను తెల్లవారుజామున 3.30 నుండి 10.30 వరకు మూసివేయనున్నారు. ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్- రెండవ వంతెన మధ్య షేక్ జాయెద్ రోడ్డు, షేక్ జాయెద్ రోడ్-అల్ బౌర్సా స్ట్రీట్ మధ్య అల్ సుకూక్ స్ట్రీట్, షేక్ జాయెద్ రోడ్ మ- అల్ ఖైల్ రోడ్ మధ్య దిగువ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ నుండి వన్-వే మార్గాలల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రత్యామ్నాయంగా ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ లోని జబీల్ ప్యాలెస్ స్ట్రీట్, అల్ ముస్తక్బాల్ రోడ్, అల్ వాస్ల్ రోడ్, అల్ ఖైల్ రోడ్, అల్ బడా స్ట్రీట్ లను వినియోగించుకోవాలని సూచించారు.

ఏమి తీసుకురావాలి

మీ దుబాయ్ రన్ బిబ్ తీసుకురావడం మర్చిపోవద్దు. దుబాయ్ రన్ టీ-షర్టుతో పాటు వాటర్ బాటిల్స్ ను వెంట తెచ్చుకోవాలి.  రన్ సమయంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలి. 

ఏమి ధరించాలి

ఏవైనా సౌకర్యవంతమైన స్పోర్ట్స్ దుస్తులను ధరించవచ్చు. దానికి తోడు తగిన రన్నింగ్ షూలను ధరించవచ్చు.

ఏ మార్గాలు అందుబాటులో ఉన్నాయి?

పాల్గొనేవారికి రెండు మార్గాలు ఉన్నాయి. ప్రారంభకులకు, కుటుంబాలకు 5 కి.మీ పరుగు, అనుభవజ్ఞులైన రన్నర్లకు 10 కి.మీ. ట్రాకులు ఏర్పాటు చేశారు. ఈ రెండు మార్గాలు ఐకానిక్ షేక్ జాయెద్ రోడ్‌లో ఉన్నందున మంచి అనుభవాన్ని అందిస్తాయి. 5 కి.మీ మార్గం దుబాయ్ మాల్ సమీపంలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ వద్ద మొదలై, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌కు దగ్గరగా ఉన్న షేక్ జాయెద్ రోడ్‌లో ముగుస్తుంది. 10km మార్గం షేక్ జాయెద్ రోడ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ దగ్గర ప్రారంభమై ఎమిరేట్స్ టవర్స్ సమీపంలోని DIFC గేట్ బిల్డింగ్ వద్ద ముగుస్తుంది.

నమోదును నిర్ధారించుకోండి

ఈవెంట్ ఉచితం అయినప్పటికీ, పాల్గొనే వారందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. dubairun.comలో సైన్ అప్ చేసిన తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌లో @dubaifitnesschallengeని అనుసరించడం ద్వారా, అన్ని ముఖ్యమైన ఈవెంట్ వివరాల కోసం వెబ్‌సైట్‌లోని 'నీడ్ టు నో' పేజీని తనిఖీ చేయడం ద్వారా అప్‌డేట్ లను తెలుసుకోవచ్చు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com