అరబ్ ఉత్పాదకతలో బహ్రెయిన్ వర్క్ఫోర్సుకు ప్రత్యేక గుర్తింపు..!!
- November 25, 2024
మనామా: బహ్రెయిన్‌లోని కార్మికులు అరబ్ ప్రపంచంలో అత్యంత ఉత్పాదకత కలిగిన వర్క్ పోర్సుగా గుర్తింపు పొందారు. ఈ మేరకు సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ నివేదిక వెల్లడించింది. ప్రాంతీయంగా మూడవ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 39వ స్థానంలో బహ్రెయిన్ నిలిచింది. గ్లోబల్ టేబుల్లో లక్సెంబర్గ్ అగ్రస్థానంలో ఉండగా, ప్రాంతీయ ర్యాంకింగ్‌లలో గల్ఫ్ రాష్ట్రాలు ముందున్నాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. సౌదీ అరేబియా అరబ్ టాప్ ప్లేస్ లో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఖతార్ 29వ స్థానంలో నిలిచింది.
యూఏఈ, కువైట్ ప్రపంచవ్యాప్తంగా 44వ, 50వ స్థానంలో ఉన్నాయి. ఒమన్, లిబియా, ఇరాక్, ఈజిప్ట్, జిబౌటీలు వరుసగా 58వ, 61వ, 72వ, 87వ, 90వ స్థానాలతో ప్రపంచ ర్యాంకింగ్‌లతో అరబ్ ప్రాంతానికి చెందిన టాప్ 10 స్థానాల్లో నిలిచాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







