సౌదీ అరేబియాలో 22.8శాతం పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!

- November 25, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో 22.8శాతం పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!

రియాద్: సౌదీ అరేబియాలో చమురుయేతర ఎగుమతులు 22.8శాతం పెరిగాయి. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. సెప్టెంబర్ 2024లో చమురుయేతర ఎగుమతుల్లో 22.8% పెరుగుదలను ప్రకటించింది. చమురుయేతర జాతీయ ఎగుమతులు రీ-ఎగుమతులు మినహా 11.6% పెరిగాయని, తిరిగి ఎగుమతి చేసిన వస్తువుల విలువ 65.4 పెరిగిందని తెలిపింది.  సెప్టెంబర్‌లో కమోడిటీ ఎగుమతుల్లో 14.9% తగ్గుదలని సూచించగా, మొత్తం ఎగుమతులలో చమురు ఎగుమతుల శాతం సెప్టెంబర్ 2023లో 79.7% నుండి సెప్టెంబర్ 2024లో 70.7%కి తగ్గింది. సెప్టెంబర్ 2024లో సౌదీ అరేబియా దిగుమతులు 15% పెరిగాయన్నారు.  సెప్టెంబర్ 2024లో చమురుయేతర వస్తువుల ఎగుమతుల శాతం 37.1%కి పెరిగినట్లు నివేదికలో తెలిపారు. ఇదే సమయంలో 15% దిగుమతుల పెరుగుదలతో పోలిస్తే చమురుయేతర ఎగుమతులు 22.8%కి చేరాయని అథారిటీ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com