పొగాకు నియంత్రణ కేంద్రం.. ఆరోగ్యవంతమైన జీవితానికి మొదటి అడుగు..!!
- November 25, 2024
దోహా: WHO సహకార కేంద్రం (WHOCC) తన వినూత్న పొగాకు నియంత్రణ కేంద్రం (TCC) సేవల ద్వారా పొగాకు నుండి విముక్తి పొందాలని, ఆరోగ్యవంతమైన జీవితానికి మొదటి అడుగు వేయాలని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) కోరింది. పొగాకు అలవాటును వదిలివేయడం జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని పొగాకు నియంత్రణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్ ముల్లా తెలిపారు. " సిగరెట్లు, ఇ-సిగరెట్లు, వేప్లు, నికోటిన్ పౌచ్లతో సహా అన్ని రూపాల్లో పొగాకును విడిచిపెట్టడంలో మీకు సహాయపడటానికి అనేక రకాల సేవలను కేంద్రం అందిస్తుంది. మా నిపుణుల బృందం మిమ్మల్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు మీ ప్రయాణానికి మద్దతునిస్తుంది." అని డా. అల్ ముల్లా తెలిపారు. పొగాకు వాడకం అనేది కేవలం సిగరెట్లే కాదని, ఇతర పరికరాలతోపాటు వేప్లు. నికోటిన్ పౌచ్ల వాడకం కూడా పెరుగుతోందని అల్ ముల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
"సాంప్రదాయ సిగరెట్లు, షిషా వాడకం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉన్నప్పటికీ, ఇ-సిగరెట్లు, వేప్లు, కోటిన్ పౌచ్ల వంటి కొత్త పొగాకు ఉత్పత్తుల వల్ల పెరుగుతున్న ముప్పును గుర్తించడం చాలా ముఖ్యం." అని డా. అల్ ముల్లా అన్నారు. "ఈ ఉత్పత్తులు తరచుగా హానికరమైన రసాయన పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల వ్యాధి, గుండె సమస్యలు, క్యాన్సర్తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. పొగాకు ప్రత్యామ్నాయాలు సురక్షితమైనవి అనే అపోహను తొలగించడం చాలా అవసరం. పొగాకు వాడక రూపం ఏదైనా ఆరోగ్యంపై తీవ్ర నష్టాలను కలిగిస్తుంది." అని పేర్కొన్నారు. పౌరులు, నివాసితులకు HMC పొగాకు విరమణ సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. TCC చికిత్స కార్యక్రమాలు ప్రధానంగా కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, మెడిసిన్ త్వారా ప్రతి రోగికి సమగ్ర చికిత్స ప్రణాళికలో భాగంగా ఉంటాయన్నారు. హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీలోని పొగాకు నియంత్రణ కేంద్రంతో పాటు హమద్ జనరల్ హాస్పిటల్ ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్, అల్ వక్రా హాస్పిటల్, అల్ ఖోర్ హాస్పిటల్, హజ్మ్ మెబీరీక్ జనరల్ హాస్పిటల్లో క్విట్ స్మోకింగ్ క్లినిక్లు ఉన్నాయని తెలిపారు. పొగాకు మానేయడంలో సహాయం లేదా సలహా కోసం 40254981 లేదా వాట్పాప్ 5080 0959కి కాల్ చేసి నిపుణులతో సంప్రదించాలని డాక్టర్ అల్ ముల్లా కోరారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







