ప్రపంచంలో పాములు లేని దేశాల గురించి తెలుసా..?
- November 26, 2024
ప్రపంచంలో పాములు లేని దేశాల గురించి తెలుసా..?క్రెటేషియస్ కాలంలో బల్లుల నుండి అనేక పరిణామలు చెందిన పాములు భూమిపై సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి జీవిస్తున్నాయి. భూమిపైన ఇప్పటివరకు సుమారు 2,900 పాము జాతులు పైగా గుర్తించబడ్డాయి.ప్రపచవ్యాప్తంగా ఇవి అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో విస్తరించి ఉన్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల పాములు కనిపిస్తాయి.
అయితే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా భూమిపై కొన్ని దేశాలలో ఇప్పటికీ పాములు లేవంటే నమ్మగలరా? అవును మీరు విన్నది నిజమే ఇప్పటికి ప్రపంచంలోని కొన్ని దేశాలలో పాముల ఉనికి అసలు లేదు. పాములు సాధారణంగా వేడి వాతావరణంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. చల్లని ప్రదేశాల్లో అవి మనవడు కొనసాగించలేవు. అయితే పాములు లేని దేశాలు చాలా అరుదుగా ఉంటాయి. భూమి మీద పాములు లేని దేశాల గురించి తెలుసుకుందాం.
అంటార్కిటికా ఖండం, ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజీలాండ్ వంటి దేశాలలో పాములు ఉండవు. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణ పరిస్థితులు. సాధారణంగా పాములు చల్లని వాతావరణంలో జీవించలేవు. అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది కావున ఈ ప్రాంతాలలో పాములు కనిపించవు.
అక్కడి తీవ్ర చలి కారణంగా పాములు మనగలవు కాదు. ఐర్లాండ్‌లో పాములు లేవనడానికి పురాణాల ప్రకారం, సెయింట్ పాట్రిక్ అనే క్రైస్తవ సన్యాసి అన్ని పాములను సముద్రంలోకి విసిరినట్లు చెబుతారు. కానీ వాస్తవానికి, ఐర్లాండ్‌లో పాములు ఎప్పుడూ లేవు. .
ఇక న్యూజీలాండ్ విషయానికి వస్తే, అక్కడి వాతావరణం కూడా పాములకు అనుకూలంగా ఉండదు. అలాగే, న్యూజీలాండ్‌లో పాములు ప్రవేశించకుండా కఠినమైన నియమాలు ఉన్నాయి.
మరిన్ని దేశాలు, ఉదాహరణకు, గ్రీన్లాండ్, ఉత్తర రష్యా, కెనడా వంటి ప్రాంతాలలో కూడా పాములు లేవు. ఈ ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉండడం వల్ల పాములు మనగలవు కష్టమని నిపుణులు చెబుతున్నారు.
అయితే అంటార్కిటికా ప్రాంతంలో మంచు యుగం ప్రారంభానికి ముందు, అంటే సుమారు 10,000 ఏళ్ళ క్రితం, ఈ ప్రాంతాల్లో పాములు మరియు ఇతర జీవరాశులు నివసించేవి. కానీ, మంచు యుగం ప్రారంభం తర్వాత, అక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఈ మార్పుల వల్ల, అక్కడ ఉన్న జీవరాశులు మనుగడ సాగించలేకపోయాయి.
మంచు యుగం ముగిసిన తర్వాత, సముద్రంపై ఉన్న మంచు కరిగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ ప్రాంతాలు ఇతర భూభాగాలతో కనెక్షన్ కోల్పోయాయి.ఈ కారణంగా, పాములు మరియు ఇతర జంతువులు తిరిగి ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి. అందుకే ఈ ప్రాంతాల్లో పాములు లేవు.శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పరిశీలించి, ఈ ప్రాంతాల్లో పాములు లేనందుకు ఈ కారణాలను సూచిస్తున్నారు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







