యూఏఈ ట్రైవింగ్ లైసెన్సుతో టెక్సాస్‌లో డ్రైవింగ్..!!

- November 26, 2024 , by Maagulf
యూఏఈ ట్రైవింగ్ లైసెన్సుతో టెక్సాస్‌లో డ్రైవింగ్..!!

యూఏఈ: యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి శుభవార్త తెలిపారు. ఇకపై ఎలాంటి పరీక్షలు లేకుండానే టెక్సాస్ స్టేట్‌లో డ్రైవింగ్ చేయవచ్చు.  ఈ మేరకు అధికారులు X లో ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ లైసెన్స్ కలిగిన నివాసితులు, పర్యాటకులు టెక్సాస్‌లో సులభంగా లైసెన్స్ పొందవచ్చు.  ఈ మేరకు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యూఎస్ స్టేట్ ఆఫ్ టెక్సాస్‌లోని పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ రెండు సంస్థలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లకు పరస్పర గుర్తింపుతోపాటు చెల్లుబాటుకు అనుమతివ్వనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com