ఏపీ: డ్రగ్స్ పై డేగ క‌న్ను

- November 28, 2024 , by Maagulf
ఏపీ: డ్రగ్స్ పై డేగ క‌న్ను

అమరావతి: డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈగల్ కోసం సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

కాగా, ఈగల్‌కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఇక‌ ఈగల్ ఫోర్స్ కోసం రూ.8.59 కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం… ఫోర్స్‌లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే.. డ్రగ్స్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో మొత్తం ఐదు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదించామని ప్రభుత్వం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com