జీసీసీ మినిస్ట్రియల్ భేటీ.. గాజా, లెబనాన్‌ పరిణామాలపై సమీక్ష..!!

- November 29, 2024 , by Maagulf
జీసీసీ మినిస్ట్రియల్ భేటీ.. గాజా, లెబనాన్‌ పరిణామాలపై సమీక్ష..!!

కువైట్: తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)  సుప్రీం కౌన్సిల్ 162వ సన్నాహక మంత్రివర్గ సమావేశం చర్చించింది. ముఖ్యంగా గాజా స్ట్రిప్, లెబనాన్‌లో పరిణామాలను సమీక్షించారు. కువైట్‌లో కువైట్ విదేశాంగ మంత్రి, ప్రస్తుత మంత్రివర్గ సెషన్ ఛైర్మన్ అబ్దుల్లా అల్-యాహ్యా అధ్యక్షతన జరిగిన సమావేశానికి సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ హాజరయ్యారు.  డిసెంబరు 1వ తేదీన  కువైట్‌ సిటీలో జరగనున్న జిసిసి సుప్రీం కౌన్సిల్‌ 45వ సెషన్‌ ఎజెండాపై ఈ సమావేశం చర్చించి ఖరారు చేస్తోంది. జిసిసి రాష్ట్రాల నేతలు, దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సన్నాహక సమావేశంలో పాల్గొన్న జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు..ఉమ్మడి గల్ఫ్ పురోగతిని మరింత మెరుగుపరచడానికి ఉన్న మార్గాలపై సమీక్షించారు. తక్షణ కాల్పుల విరమణ, పాలస్తీనా సమస్యకు న్యాయమైన సమగ్రమైన పరిష్కారాన్ని చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com