ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చొరవ.. లేబర్ లా అవేర్‌నెస్ సెషన్‌ సక్సెస్..!!

- November 29, 2024 , by Maagulf
ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చొరవ.. లేబర్ లా అవేర్‌నెస్ సెషన్‌ సక్సెస్..!!

కువైట్: కువైట్ కార్మిక చట్టాలపై భారతీయ కమ్యూనిటీ సభ్యులలో అవగాహన పెంచడానికి సమాచార సెషన్‌ను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించింది.  ఈ సెషన్‌లో పబ్లిక్ మ్యాన్‌పవర్ అథారిటీ (PAM), డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ (DLO)  అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. సమస్యలో ఉన్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి రాయబార కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఫిర్యాదులను పరిష్కరించడానికి తమ అత్యవసర వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌లు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. నవంబర్ 29 వఫ్రాలో కాన్సులర్ క్యాంపును నిర్వహిస్తోందని, ప్రవాస భారతీయులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం కువైట్‌లోని ప్రైవేట్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్ వర్కర్లకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను అధికారులు వివరించారు.  ఈ సెషన్‌లో వివిధ భారతీయ సంఘాల ప్రతినిధులు, కువైట్‌లోని వివిధ కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెందిన హెచ్‌ఆర్ అధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com