రోడ్డు దాటుతూ 8 ఏళ్ల బాలిక ప్రమాదంలో మృతి
- June 26, 2016
షార్జ: శుక్రవారం షార్జాలో అల్ ఇస్క్ల్ల్ ప్రాంతంలో రహదారి దాటే సమయంలో ఒక కారుకు అడ్డంగా పరుగెత్తడంతో ఒక ఎనిమిది ఏళ్ల భారతీయ బాలిక మృతి చెందిందని అధికారిక సమాచారం మా గల్ఫ్ డాట్ కామ్ కు తెలిపారు.
రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ పెట్రోల్ మరియు పారామెడికల బృందాన్ని అప్రమత్తం చేసి ప్రమాద స్థలంకు చేరుకొన్నారు. వలస మరియు అల్ ఇస్క్ల్ల్ కూడలి ట్రాఫిక్ సిగ్నల్ మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ బాలిక తన కుటుంబం తో కలిసి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆ అధికారి తెలిపారు.
ప్రమాదంలో మరణించిన బాలిక తన కుటుంబంతో సహా పాదచారుల క్రాసింగ్ సమీపంలో అయినప్పటికీ ఒక రోడ్డు దాటే గుర్తులు లేని ఒక ప్రాంతం నుండి రహదారి దాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వేగవంతంగా డ్రైవర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక మృతికి కారణమైన డ్రైవర్ ని అల్ గర్బ పోలీసు స్టేషన్ వద్ద కస్టడీలో తీసుకొని ప్రమాదం గూర్చి ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
రహదారి భద్రతా నియమాలు గమనించి రోడ్డు దాటాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అలాగే రహదారులు దాటే ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని షార్జా పోలీస్ డ్రైవర్లని కోరారు. ఇదిలా ఉంటే, ఒక భారతీయుడికి శుక్రవారం సాయంత్రం వేగంగా వచ్చే వాహనం గుద్దినట్లు పోలీసులు శనివారం చెప్పారు. ఇంటర్చేంజ్ సంఖ్య 4 వైపు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ మీద ఒక వంతెన పారిశ్రామిక వాడలో కింద జరిగింది. బాధితుడు అకస్మాత్తుగా అతను వేగవంతంగా వచ్చే వాహనం చూడకుండా రోడ్డు దాటే యత్నం చేసాడని పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ వ్యక్తిని అల్ ఖ్అస్సిమి హాస్పిటల్ యొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించారు. ఈ ప్రమాదంపై కారణమైన డ్రైవర్ పోలీసుల నిర్బంధంలో ఉన్నాడు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







