సౌత్ అల్ షర్కియాలో కొత్త ఆధునాతన ఆసుపత్రికి శంకుస్థాపన..!!

- December 03, 2024 , by Maagulf
సౌత్ అల్ షర్కియాలో కొత్త ఆధునాతన ఆసుపత్రికి శంకుస్థాపన..!!

జలాన్ బనీ బు అలీ: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో "అల్-ఫలాహ్ హాస్పిటల్"కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శంకుస్థాపన చేసింది.  RO 51,861,148 ఖర్చుతో ఈ హాస్పిటల్ ను నిర్మించనున్నారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మత్స్య, జలవనరుల శాఖ మంత్రి సౌద్ హమూద్ అల్ హబ్సీ, హెల్త్ మినిస్టర్ హిలాల్ అలీ అల్-సబ్తీ పాల్గొన్నారు.  

అల్-ఫలాహ్ హాస్పిటల్ 343,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 58,000 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణంలో నిర్మించనున్నారు.  ఆసుపత్రిలో 170 పడకల సామర్థ్యంతో 38 ఔట్ పేషెంట్ క్లినిక్‌లు, అత్యవసర, ట్రామా విభాగంతో పాటు వివిధ వైద్య ప్రత్యేకతలను కలిగి ఉంది.

రేడియాలజీ విభాగంలో MRI, CT స్కాన్‌లు, అల్ట్రాసౌండ్‌లతో సహా సరికొత్త ఇమేజింగ్ టెక్నాలజీలను ఏర్పాటు చేయనున్నారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ వార్డులతో పాటు నెఫ్రాలజీ యూనిట్, డే-కేర్ యూనిట్, డెంటల్ క్లినిక్ కూడా ప్రారంభించనున్నారు. పిల్లల వార్డు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ప్రసూతి & గైనకాలజీ వార్డు, డెలివరీ విభాగం, నవజాత శిశువుల కోసం నియోనాటల్ కేర్ యూనిట్‌తో కూడిన ప్రత్యేక ప్రసూతి, గైనకాలజీ, పీడియాట్రిక్ యూనిట్‌ను నిర్మించనున్నారు. 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com