గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్..దోహా 'రిగ్ 1938' అరుదైన ఘనత..!!
- December 03, 2024
దోహా: 'రిగ్ 1938' టవర్ 76.309 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ స్లైడ్ టవర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరి అరుదైన ఘనత సాధించింది. మొత్తం 12 వాటర్ స్లైడ్లను కలిగి ఉన్న మొదటి టవర్ గా గుర్తింపు పొందింది. ప్రపంచ స్థాయి గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఖతార్ స్థానాన్ని పెంపొందించేలా ఈ టవర్ ఖ్యాతి పొందిందని ఖేతైఫాన్ ప్రాజెక్ట్స్ కంపెనీ జనరల్ మేనేజర్, ఛైర్మన్ షేక్ నాసర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ తెలిపారు.
టవర్ కేవలం వినోద ల్యాండ్‌మార్క్ మాత్రమే కాదని, ఖతార్ సంస్కృతిని, సృజనాత్మకతను పెంపొందించే చిహ్నం అని ఆయన పేర్కొన్నారు. 85 మీటర్ల ఎత్తు, 12 వాటర్ స్లైడ్లను కలిగి ఉన్న టవర్.. ఖతార్‌లోని చమురు, గ్యాస్ ఆవిష్కరణ చరిత్రకి సాక్ష్యంగా ఉంది. ఈ టవర్ మెరియాల్ సిటీ నడిబొడ్డున ఉంది. ఇది 281 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి, 36 వినూత్న వాటర్ గేమ్‌లతో ఈ ప్రాంతంలోని అతిపెద్ద వాటర్ పార్కులలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







