సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఏపీ యువకులు..
- December 03, 2024
సౌదీ అరేబియా: సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు చెందిన యువకులు.కంబస్ పరిశ్రమలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షా 20వేలు తీసుకుని 16 మందిని ఏజెంట్లు సౌదీకి పంపారు. సౌదీలో 2 నెలలుగా కష్టపడి పనిచేసినా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి, తాగునీరు లేక సౌదీలో యువకులు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో తమ కష్టాలను వివరిస్తూ బాధితులు కుటుంబ సభ్యులకు వీడియో పంపారు.
విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వలస కూలీలకు అండగా ఉంటానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధితులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







