క్యూలో ఉన్న భక్తులతో టీటీడీ చైర్మన్ మాటామంతీ
- December 03, 2024
తిరుమల: తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్ పాత్ హాల్ (దివ్యదర్శనం) ను తనిఖీ చేసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.మరికొందరు భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు దర్శనం మరింత త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ను కోరారు.క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, వైకుంఠం ఏవీఎస్ఓ విశ్వనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..