వైద్య ఆరోగ్యశాఖలో 6,490 పోస్టులు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్

- December 03, 2024 , by Maagulf
వైద్య ఆరోగ్యశాఖలో 6,490 పోస్టులు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్
: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆస్పత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన వైద్యారోగ్యశాఖలో 6,490 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా 14 వేల నియామకాల ప్రక్రియను విజయవంతం చేశామని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలో వైద్య సేవలను మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో 32 ట్రాన్స్‌జెండర్ (మైత్రి ట్రాన్స్) క్లినిక్స్, రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ పారా మెడికల్ కాలేజీలను, 200 పైచిలుకు అంబులెన్స్‌లకు జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు.కొత్తగా నియమితులైన 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌కు నియామక పత్రాలు అందించారు.
 
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ ప్రక్రియలో భాగంగా, ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు అందజేయడం,ఆరోగ్య ప్రొఫైల్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ విధంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తోంది.
 
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com