ఏపీలో జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్

- December 05, 2024 , by Maagulf
ఏపీలో జూనియర్ డాక్టర్స్ కు గుడ్ న్యూస్

-జూడాలకు 15 శాతం గౌరవ వేతనాలు పెంపు

అమరావతి: ఏపీలో జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు.
రెసిడెంట్ స్పెషలిస్టులకు 70వేల నుంచి 80,500, రెసిడెంట్ డెంటిస్ట్లకు ₹65వేల నుంచి ₹74,750, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85వేల నుంచి ₹97,750ల వరకు జీతాలు పెరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com