దుబాయ్ లో డ్రగ్ సప్లయర్ కు జీవిత ఖైదు..!!
- December 05, 2024
దుబాయ్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 35 ఏళ్ల బంగ్లాదేశ్ వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పక్కా సమాచారం మేరకు.. అల్ నహ్దా ప్రాంతంలో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో ఉమ్ అల్ క్వైన్ పోలీసుల యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పోలీసు బృందం నిందితుడిని అరెస్ట్ చేసింది.
2023 ఆగస్టులో అధికారులు 30 ఏళ్ల జోర్డాన్ వ్యక్తిని అరెస్టు చేయడంతో డ్రగ్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్ కొన్నవారిని అదుపులోకి తీసుకొని విచారించగా, సప్లయర్ వివరాలు తెలిసాయి. బంగ్లాదేశ్ అనుమానితుడి నుండి చాలాసార్లు గంజాయిని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ సమాచారంతో బంగ్లాదేశ్ వ్యక్తిని అరెస్టు చేయడానికి వారెంట్ పొందారు. గోల్డ్ లక్ సూపర్ మార్కెట్ సమీపంలోని అల్ నహ్దా 1లో ఒక స్టింగ్ ఆపరేషన్ చేపట్టి నిందితుడిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అనంతరం అతని ప్లాట్ నుంచి 193.13 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును విచారించిన కోర్టు.. అతనికి జీవిత ఖైదు విధించింది. యూఏఈ చట్టం ప్రకారం..జీవితఖైదు 25 సంవత్సరాలకు సమానం. జైలు శిక్ష ముగిసిన తర్వాత అతన్ని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అయితే, తీర్పుపై నిందితుడు అప్పీల్ చేశాడు. జనవరి 22న దుబాయ్ అప్పీల్ కోర్టులో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







