మంత్రుల స్థాయిలో జేసీసీ.. ఎంఓయూపై భారతదేశం, కువైట్ సంతకాలు..!!
- December 05, 2024
కువైట్: భారత విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ , కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్ యాహ్యా.. విదేశాంగ మంత్రుల స్థాయిలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ (జేసీసీ)ని ఏర్పాటు చేసేందుకు బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సాంకేతికత, వ్యవసాయం, భద్రత, సంస్కృతితో సహా రంగాలలో కొత్త జాయింట్ వర్కింగ్ గ్రూపుల ఏర్పాటును వివరిస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఈ గ్రూపులు పర్యవేక్షిస్తాయి. హైడ్రోకార్బన్‌లు, ఆరోగ్యం మరియు కాన్సులర్ విషయాలలో ఇప్పటికే ఉన్న వర్కింగ్ గ్రూపులను కూడా JCC పర్యవేక్షిస్తుంది. ఇదిలా ఉండగా, అబ్దుల్లా అలీ అల్ యాహ్యా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ లో పర్యటించేందుకు అంగీకరించారు. కువైట్ విదేశాంగ మంత్రిగా అబ్దుల్లా అలీ అల్ యాహ్యా భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







