హ్యూమన్ ట్రాఫికింగ్..ఆసియన్ కు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- December 05, 2024
మనామా: మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 10 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆసియా వ్యక్తి కేసుపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. నేరాన్ని అంగీకరించిన నిందితుడు.. ఇద్దరు ఆసియా మహిళలను వ్యభిచారంలోకి నెట్టడంతోపాటు మరో మహిళని లైంగికంగా వేధించాడు.
బహ్రెయిన్‌లోని ఒక విదేశీ రాయబార కార్యాలయం నుండి వచ్చిన నివేదిక తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను అపార్ట్‌మెంట్‌లో పెట్టి, ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు నిందితుడిని పట్టుకుని బాధితురాలిని, రెండో మహిళను రక్షించారు. బాధితులిద్దరూ ఉపాధి అవకాశాల కోసం బహ్రెయిన్ రప్పించి, తమతో జుఫైర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ లో వ్యభిచారం చేయించేవాడని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







