యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలోకి ‘సెమ్సేమియా’..!!

- December 05, 2024 , by Maagulf
యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలోకి ‘సెమ్సేమియా’..!!

రియాద్: యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ రిప్రజెంటేటివ్ లిస్ట్‌లో సౌదీ అరేబియాకు చెందిన "క్రాఫ్టింగ్ అండ్ ప్లేయింగ్ ఆఫ్ ది సెమ్సేమియా ఇన్‌స్ట్రుమెంట్" చోటు సంపాదించింది. హెరిటేజ్ కమిషన్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్, సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈజిప్ట్ నేతృత్వంలోని నామినేషన్ ఫైల్ ద్వారా ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇప్పటికే యునెస్కో సాంస్కృతిక భాగాల జాబితాలో ఉన్న మజ్లిస్, అరబిక్ కాఫీ, సౌదీ అల్-అర్దా డ్యాన్స్, అల్-కత్ అల్-అసిరి, సకార్ (ఫాల్కన్రీ), ఖర్జూరం, అల్-సదు, సంప్రదాయ నేతపని, అరబిక్ కాలిగ్రఫీ, అల్హెదా, ఖవ్లానీ కాఫీ గింజలు, హరీస్ వంటకం సరసన సెమ్సేమియా చేరింది.

సేమ్సేమియా వాయిద్యం అనేది వివాహాలు,  స్థానిక పండుగలలో వాయిస్తారు. మతపరమైన సమావేశాల సమయంలో కూడా ఈ వాయిద్యాన్ని ప్లే చేస్తారు. ఇక్కడ ప్రజలు సేమ్సేమియాతో కలిసి సాంప్రదాయ పాటలను పాడతారు. సేమ్సేమియా తీరప్రాంత కమ్యూనిటీల కళాత్మక వారసత్వంతో అనుబంధం కలిగి ఉంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com