ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా ‘జాయెద్ విమానాశ్రయం’..!!
- December 06, 2024
యూఏఈ: అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మక ప్రిక్స్ వెర్సైల్లెస్, ది వరల్డ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ అవార్డ్‌లో ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయంగా నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగంలో అత్యుత్తమ నిర్మాణ డిజైన్ గా గుర్తింపు పొందింది. విమానాశ్రయం మొదటి వార్షికోత్సవం, 53వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల సందర్భంగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్యారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు. కేవలం ఒక సంవత్సరం ఆపరేషన్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్‌కి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి, బలమైన ప్రపంచ పోటీ మధ్య జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ అత్యంత గౌరవనీయమైన విభాగంలో అగ్రస్థానాన్ని పొందిందని అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లి తెలిపారు.
యూఏఈ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేసిన జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అద్భుతమైన డిజైన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 742,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక విలక్షణమైన X- ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది. గంటకు 11,000 మంది ప్రయాణికులు, ఏకకాలంలో 79 విమానాలు ప్రయాణించేందుకు వీలుగా దీనిని నిర్మించారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







