ఇరాక్‌లోని ఫల్లుజా నగరంలో ఐఎస్‌ స్థావరాలపై దాడిచేసిన ఇరాకీ దళాలు

- June 26, 2016 , by Maagulf
ఇరాక్‌లోని ఫల్లుజా నగరంలో ఐఎస్‌ స్థావరాలపై దాడిచేసిన ఇరాకీ దళాలు

ఇరాక్‌లోని ఫల్లుజా నగరంలో ఐఎస్‌ ఉగ్రవాదుల చివరి స్థావరంపై ఇరాకీ దళాలు పట్టుసాధించాయి. ఐఎస్‌కు పట్టున్న చివరి ప్రాంతమైన వాయువ్యలోని గొలాన్‌ ప్రాంతం వైపు ఉగ్రవాద వ్యతిరేక దళాలు కదిలాయని లెఫ్టినెంట్‌ జనరల్‌ అబ్దుల్‌ వాహబ్‌ అల్‌సాదీ తెలిపారు. బాగ్దాద్‌కు పశ్చిమంగా ఉన్న ఈ పట్టణం పూర్తిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుందన్నారు. 2014లో ఐఎస్‌ ఈ నగరంపై పట్టుసాధించింది. ఇటీవల మేలో దీనిని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రభుత్వ దళాలు పోరు ప్రారంభించాయి. ఈ పోరాటంలో మొత్తం 1800 మంది మిలిటెంట్లు మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com