Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!

- December 07, 2024 , by Maagulf
Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!

యూఏఈ: యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ, వివిధ అరబ్ దేశాలకు చెందిన 15 మంది వ్యక్తులను క్రిమినల్ కోర్టుకు తరలించాలని ఆదేశించారు. వీరిలో కొందరు కస్టడీలో ఉండగా, మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఫోర్జరీ, మనీలాండరింగ్ , పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కంపెనీలపై కేసులు నమోదు చేశారు  

అమాయకులపై బాధితులే లక్ష్యంగా ఈ ముఠా మోసం చేయడానికి ఒక క్రిమినల్ ముఠాగా ఏర్పడినందని విచారణలో వెల్లడైంది. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య ఛాంబర్లు, కస్టమ్స్‌కు ఆపాదించబడిన అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి తప్పుదారి పట్టించారు. ఈ నకిలీ పత్రాలు వారు తమ క్రిమినల్ స్కీమ్ కోసం స్థాపించిన కంపెనీలను ఉపయోగించి కొనుగోలు చేశామయ, వ్యాట్ చెల్లించి, విదేశాలకు ఎగుమతి చేసినట్టు తప్పుగా క్లెయిమ్ చేసిన కల్పిత వస్తువులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కోసం చట్టవిరుద్ధంగా వాపసు పొందేందుకు వీలు కల్పించిందని అధికారులు తెలిపారు.  మొత్తంగా Dh107 మిలియన్లకు పైగా మోసం చేసినట్టు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com